*దత్తపది:బలము,కలము,జలము,స్థలము*:-బెజగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 
*చంపకమాల*
*స్థలము* నె యెంచుకొండియిక-
చక్కగనాటుడి మొక్కనందునన్
*జలమును* పోసినిత్యమును-
జాగృతమొందుచు పెంచురెప్పుడున్
*బలముగ* చెట్టుయేపెరిగి-
వర్షమునేకురిపించుచుండునే
ఫలములుకాయలిచ్చియును-
ప్రాణులకేస *కలమ్ము* గూర్చునే