విజ్ఞాన లోతుల్ని చేరుతున్నానని
విశ్వరహస్యాల్ని విప్పుతున్నానని
అభివృద్ధి శిఖరాల్ని తాకుతున్నానని
విఱ్ఱవీఁగకోయి మానవుడా!
పంచభూతాల శక్తిని
తెలుసుకోలేకపోతున్నావు
పరమాత్మ ఉనికిని
పసిగట్టలేకపోతున్నావు
ప్రకృతి తత్వమార్గాన్ని
అనుసరించలేకపోతున్నావు
ప్రకృతిని పరమాత్మగా తలచి
వికృతులని చెడుగా తలంచి
సంస్కృతిని నిలబెడుదాం
సదాచారం అనుసరిద్దాం
దురాచారం దునుమాడుదాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి