జీవనరాగం ..!! (వచన పద్యాలు):-డా.కె.ఎల్.వి.ప్రసాద్ , హన్మకొండ

  ఆడసర్పంచుల కుర్చీ మగడు ఆక్రమించు 
దళిత నాయకుడి సీటు అగ్రకులస్తుఢి చోటు!
రీజర్వేషన్ల చోద్యమిది బుద్దిగా చూడుము సొదరా 
వినుము కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము....!!
--------------------------------------------------------------
ఆడపిల్లల ఉనికికి సురక్షిత చోటు లేదెక్కడా
దళిత కూతుళ్ళమాట ఇంక చెప్పనలవికాదు!
శాసనములు-ఉపన్యాసములు అటకెక్కిపోయెరా
వినుము కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము....!!
--------------------------------------------------------------------- 
కలిసికట్టుగా ఉండి హక్కులు పోరాడు సోదరులు 
మాల -మాదిగ లమద్య మంటపెట్టే మాయగాళ్లు !
మోసగాళ్లవుచ్చుతో అన్న  దమ్ములు ఏకాకులైరికదా
వినుము  కె.ఎల్వీ. మాట  నిజము  సుమ్ము...!!
------------------------------------------------------------------
విజ్ఞాన సంపద ,తెలివితేటల ప్రతిభాపాటవాలు
ఏ ఒక్కరి సొంతమని భావించరాదు సుమా ....
కులమునకు ముడిపెట్టి కుళ్ళుకొందురు కొందరు 
వినుము కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము.....!!
------------------------------------------------------------------
స్వంత గొప్పలు చెప్పిఎవరినీ  మెప్పించ పనిలేదు ,
పప్పుకూడుకొసమని అప్పుచేయనవసరం లేదు !
'పిండికొద్దీ రొట్టె ' సూత్రము పాటించుబాయి...
వినుము  కె .ఎల్వీమాట ,నిజము సుమ్ము ....!!
---------------------------------------------------------------------
'అప్పులకు' మనిషి ఆమడదూరముండాలి ,
సంపాదనలో కొంతయినా దాచుకోవాలి ....!
రేపటి అవసరాలకు కొంతయినా మిగుల్చుకో ,
వినుము కె.ఎల్వీ.మాట, నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------------
కనీస అవసరాలకు మొదటి ప్రాధాన్యత నిమ్ము,
ఆడంబరాలకు ఆ పైన చోటుకే నీ యొక్కఓటు!
సుఖ జీవితానికి ఇది పెద్ద కనికట్టు సొదరా ....
వినుము కె.ఎల్వీ.మాట, నిజము సుమ్ము .....!!
---------------------------------------------------------------------
'వడ్డీ' ల  జోలికి అసలుపోరాదు ఎన్నటికీ ....
మాడ్చి మసిజేయు ఇది ఎంతటిమనిషినైనా !
ఖర్చులన్నీ ఓమారు విశ్లేషించు చూడుమా ...
వినుము కె.ఎల్వీ .మాట ,నిజము సుమ్ము ....!!
----------------------------------------------------------------------
ఉచితమన్న చప్పున మనసు ఉరకలేయరాదు ,
పవిత్రమైన  ఓటుకు -నోటు తో అమ్ముడుపోరాదు !
క్షణికమైన అసందర్భ సుఖాలకు బానిసకారాదు ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము......!!
--------------------------------------------------------------------
ఆన్లయిన్ క్లాసులు మొబైల్స్ తో పిల్లల ఊసులు 
తల్లిదండ్రులకుతన్నుకొచ్చిన  అసలయిన పరీక్షలు !
పాసు గ్యారంటీ ఇస్తున్న నయాపాలకుల హామీలు 
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము సుమ్ము.....!!
------------------------------------------------------------------
కాలాన్నీ ,కాలంతో నడిచి వచ్చే సహజ కార్యాల్ని
కరోనా కదలకుండా ఎలాఅదుపు చేసిందో చూడు ..!.
ఎప్పుడు ఏమౌతుందో ఎవరూ చెప్పలేని రోజు లివి
వినుము  కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
 చిలకజ్యోస్యము చెప్పి జాతకము చెప్పువారు 
తమజాతకము తెలియక బ్రతుకుల నీడ్తురు 
పొట్టకూటికొరకు కోటివిద్యలు సోదరా...
వినుము  కె.ఎల్వీ. మాట  నిజము  సుమ్ము...!!
-----------------------------------------------------------------
వాస్తు దోషమ్మని బంగారు భవంతులు కూల్చెదరు
ప్రజాధనముతో  వారి కోర్కెలు తీర్చు కొందురు ...
వాస్తు ఊసులేని దేశములెట్ల అభివృద్దిచెందే ...!
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము...!!
-----------------------------------------------------------------
చదువుకున్నవారు కూడా మూఢ నమ్మకాలఉచ్చులో  
సుఖజీవనం కోల్పోవుచున్నారు ముర్ఖ జనులు ...!
విద్యవుండికూడా వింత పశువులయిరి గదా ...
వినుము  కె.ఎల్.వి.మాట  నిజము సుమ్ము...!!
------------------------------------------------------------------

కామెంట్‌లు