సైనికునికి వందనం:యాళ్ళ ఉమామహేశ్వరివృత్తి::తెలుగు అధ్యాపకురాలు
సున్నితంరూపకర్త::: నెల్లుట్ల సునీతగారు
:----------------------
తొలిపొద్దుకి నువ్వు సూరీడువి
మలిపొద్దుక వెన్నెలల రేరాజువి
యుద్ధరంగాన అభిమన్యుడంటి సాహసివి
చూడచక్కని తెలుగు సున్నితంబు.

కన్నతల్లికి గారాల పుత్రుడివి
జన్మభూమి ఒడిలోని పాపాయివి
ఇద్దరమ్మల గారాల పట్టివి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.

విద్రోహుల గుండెలలో భయానివి
దేశమాత మకుటాన మణివి
సరిహద్దుల కాపలా సైనికుడివి
చూడచక్కని తెలుగు సున్నితంబు.

అందరకూ బంధువువు నీవు
మా హృదయాలలో చిరంజీవివి
ఎనలేని త్యాగాల సమరయోధునివి
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

ప్రాణాలు లెక్కచేయక పోరాడి
దేశాన్ని రక్షించుటకని శ్రమించి
కఠోర క్రమశిక్షణల జవానువి
చూడచక్కని తెలుగు సున్నితంబు.

కామెంట్‌లు