1.గుణాలు రక్షణకోటలు!
దుర్గుణాలు భక్షణబాటలు!
మొదటివి దిట్టంగా ఉండాలి!
తరువాతవాటికి,
దూరమవ్వాలి!
2.సొంతలాభం చూసికో!
లోభం కూడదని తెలిసికో!
ఐశ్వర్యం పెంచుకో!
అసూయ కాదు!
అది ఆన్సర్ లేని కేన్సర్!
3.కోపం జయించు!
బుద్ధి రక్షించుకో!
బుద్ధి నశిస్తే!
మరి జీవితం వికసించదు!
4.జీవితం నడక!
నడతపై నడుస్తుంది!
బతుకు పాలు!
నేయిగా మారాలి!
నేలపాలు కానీయకు!
5.ఆశలు, ఆశయాలు!
మమకారాలు,అధికారాలు!
అహంకారాలు,తిరస్కారాలు!
అన్నీ కదిలి పోతాయి!
నీవూ ఏమి నిలిచిపోవు!
6.శత్రువులను పెంచుకోకు!
చెదపురుగులై దహిస్తారు!
జీవితం వైకుంఠపాళి!
నిచ్చెనలేనా!పాములున్నాయి!
తస్మాత్ జాగ్రత్త!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి