ఒక దొంగ -బాలగేయం మణిపూసలు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

అందరు మెచ్చిన దొంగా 
అపురూపం ఈ దొంగా 
అందరి ఇంట్లో ఉండు 
అల్లరి కృష్ణుడె దొంగా !

వెన్నల నన్నీ మింగా 
అందరు కనుగొని రంగా 
ఇదేమి టంటూ  అడుగుతు 
చెవులే మెలివేయంగా !

మూతికి ఎప్పుడు బుంగా 
అమ్మతొ  గారా బంగా
ఎన్నో ప్రశ్నలు వేస్తూ 
కొంగుపట్టి తిరగంగా !

లేగలతో ఆడంగా 
వేణువూది రమ్యంగా 
యమున తీర వ్రేపల్లె 
కృష్ణా యని పిలవంగా !!