సూక్తిసుధ:-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట*
ఆటవెలదులు

నీతి కలిగి నడువ- నిర్మలమగుజన్మ 
ఖ్యాతిపొందునెపుడు- నీతితోడ
నీతివదులునతడె-జాతికేకీడౌను
పరశురాముమాట-పసిడిమూట

అన్నదానమెపుడు-అమితముగనుజేయ
అమరమైన కీర్తి-యమరుచుండు
దానగుణమెయున్న-ధరణియెనినుమెచ్చు
పరశురాముమాట-పసిడిమూట

మనుజమేలుకోరి-మానవాళినిపుడు
పరిసరములనన్ని-పాడుజేయ
జీవరాశియెటుల-జీవించుభువియందు 
పరశురాముమాట-పసిడిమూట



కామెంట్‌లు