పెట్టిన మొక్కలు పేర్మిగ బెంచన్,
బొట్టియ తీరుగ భూరిగ గాం చన్,
లొట్టియ నీటిని రోజును పోయన్.
దట్టగ కానలు దండిగ యౌరా,
వెట్టలు తగ్గును వేదన దీరున్,
మెట్టని ప్రాంతము మేదిని జూడన్,
తెట్టెలు తెట్టెలు తేజము నొందున్.
కిట్టము గాలిన కీడును వీడన్,
వొట్టము లేకనె వుండగ మిన్నన్ ,
గట్టిగ దీక్షను గైకొని చేయన్,
చట్టము దేవలె సాధ్యము తోడన్,
కొట్టుట నేరము ఘోరము చూడన్,
చెట్టును గొట్టిన చేటుయె కల్గున్,
కట్టడి జేయగ కానలు మిన్నౌ,
చుట్టము వోలెను జూచును చెట్లే.
వెట్ట....వేడి
మెట్ట...దిబ్బ
తెట్టె...రాశి
ఒట్టము..నష్టము
కిట్టము...మురికి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి