గురుభక్తి....అచ్యుతుని రాజ్యశ్రీ

 అమ్మా నాన్న తర్వాత అంతటి వాడు గురువు. చీకటిని పోగొట్టే  సూరీడు. మంచి గురువు  ఉత్తమమార్గం చూపుతాడు.మనకుతెలీని విషయాలు వివరించి చెప్పేప్రతివారూ గురువులు.వయసులో  చిన్న పెద్ద ఎవరైనా కావచ్చు. అధ్యాపకులు బడిలో  సబ్జెక్ట్ చెప్తూ పరీక్ష లో  ఉత్తీర్ణులు అయ్యేలా చేస్తారు. వారిపై భక్తి శ్రద్ధ కలిగిఉంటేనే మనకు చదువు వంటబడుతుంది.
     ఛత్రపతి శివాజీ గూర్చి మనందరికీ తెలుసు కానీ ఆయన గురువు సమర్ధరామదాసు గూర్చి  మనకు అంతగా తెలీదు.ఆసాధువు ప్రభావం  శివాజీ పై ఎంతో ఉంది. ఒకసారి ఆయన శివాజీ ని పరీక్షించాలనుకున్నాడు. సాధుపురుషులు కలలో కనపడి ఆదేశిస్తారు. గాఢనిద్ర లో ఉన్న శివాజీ కి రామదాసు కనపడి"నీకు  అత్యంత ప్రీతికరమైనది నాకు అర్పించు."అని  అడగగానే  శివాజీ "స్వామీ! నారాజ్యం అంతా నీ పాదాల మ్రోల పెడుతున్నా "అన్నాడు. "దీని పాలకులు ఇంక  మీరే." ఆగురువు నవ్వుతూ "శివా!ఈకాషాయజెండాని నీచేతిలో పెడుతున్నాను.  ధర్మం గా పాలిస్తూ  సనాతన భారతీయ ఆర్షధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత  ఇక నీదే.భారతమాత భవ్య చరిత మరాఠా వీరుల శక్తి యుక్తులను లోకానికి చాటి  శాశ్వతంగా ప్రజల గుండెలో నిండి పో..".
అంతే!నిద్ర నుంచి మేలుకున్న శివాజీ  ఆతర్వాత  ఎలా విజృంభించి తురుష్కుల అగ్గగ్గలాడించాడో మనందరికీ తెలుసు. అలా గురు శిష్యులు ఉండాలి.
కామెంట్‌లు