నేర్పరి "తేనెటీగ":--గద్వాల సోమన్న
తేనెటీగ వచ్చింది
పూల మీద వాలింది
ప్రేమగ ముద్దాడింది
మకరందము గ్రోలింది

తన వారిని పిలిచింది
తేనేతుట్టె కట్టింది
తేనెనందు పెట్టింది
చెల్లికి,నాకు ఇచ్చింది

తేనెతుట్టెలో కలవు
ఎన్నో చక్కని గదులు
కాపురమందున్నాయి
చాలా తేనెటీగలు

ఔషధానికి శ్రేష్ఠము
తేనె ఎంతో మధురము
శ్రమజీవులు తేనెటీగలు
అందరికి భలే ఇష్టము


కామెంట్‌లు