సలహా...అచ్యుతుని రాజ్యశ్రీ


 ఒకప్పుడు ఉమ్మడి పెద్ద కుటుంబాలు. తండ్రి  ఆతరువాత  పెద్ద అన్న  చెప్పి నట్లుగా ఆ తరువాతి పిల్లలు వినేవారు. అక్క అన్నల దుస్తులు  కూడా   ధరించి మహా పొదుపుగా ఉండేవారు. ఇన్ని ఉద్యోగాలు  చదువులులేవు.పెద్ద పిల్లాడు  చదువు కుని మిగతా తమ్ముళ్ళ ను చదివించేవాడు.అన్నదమ్ములంతా పెళ్లి అయినా  ఉమ్మడి గా ఉండేవారు. ఖర్చు  అంతా సమంగా పంచుకున్న తృప్తి గా బతికిన రోజులవి.

అలాంటి ఇంటి పెద్ద మంచం పట్టాడు. కొడుకులంతా ఐకమత్యంగాఉండటం  సంతృప్తి నిచ్చింది.ఆరోజు అందరినీ పిలిచి ఇలా చెప్పా డు'నేను  ఎక్కువ కాలం బతకను.మీరు దుకాణానికి  నీడగా ఉండగా వెళ్లి  నీడలోనే రండి. ఎవరికైనా అప్పు ఇస్తే వస్తువుల కి డబ్బు  అడగవద్దు. మీకు  కష్టనష్టాలు కలిగినప్పుడు  గ్రామ పెద్దలు  తెలివిగలవారిని అడగండి. " ఆయన దాటిపోయాక పిల్లలు  తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. ఓగుర్రపుబండీలో ఎండతగలకుండా వెళ్లి  షాపు లో కూచుని  బండిలోనే ఇ ల్లు చేరుతున్నారు. సరుకులు అప్పు గాఇస్తూ డబ్బు అడిగేవారు కాదు. ఇంకేముంది. సరుకులు అయిపోయి ఖాళీ గా ఉంది షాపు. పైగా తండ్రి ఇంకోమాట చెప్పాడు."మీరు  బావి దగ్గరకు వెళ్ళి భోరుమని ఏడ్చి మీ కష్టాలు చెప్పండి. అది జవాబు ఇవ్వకపోతే  పెద్దల దగ్గరకు పోండి " ఈవెర్రిబాగులు బావిదగ్గర భోరు మన్నా ఫలితం శూన్యం. గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి తండ్రి చెప్పినట్లుగా చేసినా ఫలితం శూన్యం  అనిమొర పెట్టుకున్నా రు.వారు  నవ్వుతూ ఇలా చెప్పారు  "మీనాన్న మాటలని తప్పుగా అర్థం చేసుకున్నారు. నీడలో వెళ్ళి రావటం అంటే సూర్యోదయానికి ముందే వెళ్ళి   అస్తమయమైనాక  చీకటి పడినాక ఇల్లు చేరమని అర్థం. అప్పుగా వస్తువులు అంటే అరువు ఇవ్వకుండా  వెంటనే  డబ్బు తీసుకుంటే  బాకీ తీర్చమని వారిని  అడగవలసిన పని ఉండదు. బావిలో సంపద దాచి ఉంటాడు. అందుకే అక్కడ ఏడవమన్నాడు.అంతే వారికి బుద్ది వచ్చింది. బావి చుట్టుపక్కల తవ్వారు. లోపల నాణాలున్న బిందెలు మూడు కనపడ్డాయి. తలా ఒకటి తీసుకుని  సరుకులు కొని జాగ్రత్త గా  వంతులు వారిగా వ్యాపారం ని అభివృద్ధి చేశారు. తన్ను మాలినధర్మం మొదలు చెడ్డ బేరం.సలహాలు బాగా అర్ధం చేసుకోవాలి. పెద్దలు ఉండగానే  వ్యాపార మెలుకువ లు రహస్యాలు తెలుసు కోవాలి. పెద్దలమాట చద్దిమూట సుమా!