గాలికి లేదు కులం
అమ్మకూ లేదు కులం
తన సంతుకు
సంస్కృతీ సంప్రదాయిలను
నేర్పించే సమయాన
'బ్రాహ్మణ' వనితగా మారుతుంది అమ్మ
తన సంతును సాటిలేని వీరులుగా
తీర్చి దిద్దే సమయాన
'క్షత్రియ' వనితగా మారుతుంది
ధైర్యాన్ని నూరి ఉగ్గుగా పడుతుంది
తన పిల్లలు పెరిగి ప్రయోజకులై
సంపాదిస్తున్న వేళ
'వైశ్య' వనితౌతుంది అమ్మ
వారికి పొదుపూ
మదుపూ నేర్పిస్తుంది ఆమె
ఇక ఆమ్మ బిడ్డల బాల్యంలో
ఆలనా పాలనా చూసే సమయాన
'శూద్ర' వనితౌతుంది
మలమూత్రాలను యెత్తుతుంది
బిడ్డడి బట్టలను శుభ్రపరుస్తుంది
అందువలననే
అమ్మకు లేదు కులం
వీచే గాలికి వలెనే
'అమ్మ':- సత్యవాణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి