01.
తే.గీ.
ఆంధ్రరాష్ట్రగీతమ్మునునద్భుతముగ
రచనజేసివిద్వత్కవిరాణకెక్కి
తెలుగుసాహితీక్షేత్రానధీరుడిగను
"శంకరంబాడిసుందరాచారివెలిగె"!!!
02.
తే.గీ.
పద్యమన్ననువారికిపరమప్రీతి
"తేటగీతి"పద్యములన్నతీపియనుచు
తనదుపేరునిందునిమిడెయనుచుమురిసి
"శంకరంబాడిసుందరాచారివెలిగె"!!!
03.
తే.గీ.
గాంధిపైనను"బలిదాన"కావ్యమల్లి
ఆరవీంద్రు"గీతాంజలి"యనువదించి
"శ్రీనివాసశతకము"నుపూనివ్రాసి
"శంకరంబాడిసుందరాచారి వెలిగె"!!!
04.
కం.
"సుందరరామాయణమును"
సుందరమగుభారతము"నుసృజియించియుతా
"సుందరచారియె"కావ్యపు
విందునువాణికియొసగియువిఖ్యాతుడయెన్!!!
05.
కం.
మృదువైనపదమ్ములతో
మధురముగారచనలెన్నొమనకందించెన్
మదిలోసుస్థిరస్థానము
పదిలపరుచుకొనియుతానుపండితుడయ్యెన్!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి