"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులు-సిద్ధిపేట--చరవాణి :- 6300474467

 "నాగులపంచమిపండుగ-పద్యాలు"
01.
కం.
నాగులపంచమిరోజున
నాగులకునుపాలుబోసినారీమణులున్
నాగులమ్రొక్కుచుపూజలు
బాగుగభువిపైజరిపియుభక్తినిచాటున్!!!
02.
తే.గీ.
పుట్టలోపాలుపోసియుచుట్టుదిరిగి
నారిమణులంతభక్తితోనమ్మకముగ
నాగుబాములన్పూజించిరాగమొలక
శుభముజేకూర్చుమనివేడుసుందరముగ!!!


కామెంట్‌లు