*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౦ - 80)

 శార్దూలము:
*ద్వారద్వారములందుగాంచుకిజన | వ్రాతంబు, దండంబులన్*
*దోరంతస్థలి భగ్గునన్ పొడుచుచున్ | దుర్భాషలాడన్ మరిన్*
*వారిం బ్రార్ధనజేసి, రాజులకు సేవ | ల్సేయగా బోరు ల*
*క్ష్మీ రాజ్యంబును గోరి నీ పరిజనుల్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....

భూమి మీద కనిపించే, రాజులు, మంత్రుల ఆఫీసుల వద్ద కాపాలా వాళ్ళు ఎంతగా తిట్టినా, కొట్టినా, ఈ కనిపించే ప్రపంచంలో ఉపయోగ పడుతుంది అనుకునే డబ్బు, డాబు, గౌరవం మొదలైనవి పొందడానికి మా మనుషులు, రాజులు, మంత్రుల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు.  కానీ, నీ భక్తులు ఇటువంటి రాజులకు, మంత్రులకు సేవలు చేయడానికి వెళ్ళడానికి ఇష్టపడరు......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*" సర్వ భర్తవు. సర్వ కర్తవు. సర్వ భోక్తవు." నీవే మా వైపు వుండగా వేరొకరిని సేవించ వలసిన అగత్యం మాకు ఎందుకు కలుగుతుంది, మహాశివా!  ఇక్కడ, ఈ పాంచభౌతికంగా లభించే సంపదలు, ఛీత్కారాలు మాకు వద్దు. సర్వ సంపదలకూ పై మెట్టు పైన వున్న నీ సన్నిధానంలో ఒక చిన్న రేణువుగా పడివుండే అవకాశం కలిగించు, కారుణ్య ధామా!  ఈ శ్వాస, నీ శ్వాసలో కలిసే వరకూ, నీ తలపు మరపుకు రాకుండా నీవే కాపు కాయాలి, పన్నగేశా!  నీ ధ్యసలోనే వుండగలిగే నిశ్చలత్వాన్ని, నిన్ను మరువని బుద్ది ని మాకు నీవే ప్రసాదించాలి, పార్వతీ పతీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు