తొణుకులు :-చంద్రకళ. దీకొండ,-మేడ్చల్-మల్కాజిగిరి-చరవాణి:9381361384

 ౧
గురజాడ గేయాల బాట
నండూరి వారి ఎంకి పాట
గుమ్మపాలోలె కమ్మనైన భాష
చిలకమర్తి హాస్యపు మాట...!

పద్య ప్రత్యేకత కలిగినది
విశ్వనాథ విరితేనెల తేట
పలు ప్రక్రియల వెలుగునది
దేవులపల్లి కమ్మనైన పాట...!

వెలుగులు వెదజల్లే వెన్నెల
చలువలు పంచునందరికీ
వెతలు మరపించే వెన్నెల
శాంతిని చేకూర్చునందరికీ...!

వెన్నెల్లో విరబూసిన విరులు
నీలిమేఘాల తేలే జాబిల్లి
వెలది కనులలో వెలుగులు
దోబూచులాడే వెన్నెల చల్లి...!

 

కామెంట్‌లు