సీ.మా. పద్యం:-
శ్రావణ శుద్ధ పంచమి చక్కని ఘడియ
నాగదేవతపూజ నాచరింప
పొలతులందరుగూడి పుట్ట వద్దకు జేరి
పసుపు కుంకుమ బెట్టి పాలు వోసి
పాలు పండ్లు పూలు పాయసాన్నములును
నైవేధ్యమునుబెట్టి నబ్బురముగ
పిల్ల పాపలనెల్ల చల్లంగ జూడంటు
నాగమ్మకును మొక్కి నమ్మ కముగ
స్తోత్రము లనుపాడి స్తుతించి ప్రార్థింప
కామితములుదీర్చి కరుణ తోడ
సత్ససంపదలిచ్చి, సౌభాగ్య మిచ్చును
భక్త జనులుగొల్వ భాసురముగ !
తే.గీ:- కశ్యప,వినతల తనయుడు గరుడుడు తను
అమృతభాండము తెచ్చిచ్చె నమ్మ కొరకు
గరుతు మంతుడి చిరకాల కాంక్ష ధీరి
మాతృ దాశ్యమ్ము బాపినా మంచి
రోజు'గరుడ పంచమి' గా యిలన్ ఘనత కెక్కె !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి