సీ:భరతఖండమునందు బహుళ పేరునుబొంది
విశ్వమేధావైన విజ్ఞుడెవరు?
కులమత భేదాల కుళ్ళును కూల్చేసి
మానవులొకటన్ని మాన్యులెవరు?
సకల భోగాలను సత్వరం బొదలియు
సన్యాసి యైనట్డి సాధువెవరు?
శాంతమ్ము గలిగిన సహకార జనులంత
తనవారు నన్నట్టి తాపసెవరు?
తేగీ:జనము బాధలు దొలగించ వనము కెళ్ళె
రాజుగనుబుట్టి జనులవి రంది గనియె
రక్త పాతమ్ము వద్దన్న రత్నమతడు
సిద్దు డిగబెర్గి గౌతమ బుద్దుడయ్యె!!
కం:మాయా దేవియు తల్లీ
చేయును దానంబునామె చెప్పక యెపుడున్
వేయును కంచములన్నము
మోయును భారంబునామె యోపిక తోడన్!!
కం:శుద్దోధనమహరాజును
బుద్దిగ రాజ్యాన్ని యేలె భూపతి యతడున్
ముద్దుల సుతుడును సిద్దుడు
బుద్దుడిగాపేరుబొంది భువిలో వెలిగెన్!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి