లోపలి సముద్రం: ------ వారాల ఆనంద్

 కడలిని చూసి చాలా  ఏళ్ళు అయింది
ఉప్పొంగి ఎగిసి పడుతున్న
అల చివరి నురగ బెంగెట్టుకుందేమో
 
నా లోపలా ఉప్పెనేదో
సుళ్ళు తిరుగుతున్నది
చిత్రంగా అలా లేదు
నురగా లేదు మెరుపూ లేదు
 
బయటి సముద్రానికేమో
తీరిక లేదు అలసటా లేదు
 
నా లోపలి సముద్రానికేమో
దిగులెక్కువ బుగులెక్కువ
భ్రమలెక్కువ ప్రేమా ఎక్కువే  
 
అందుకేనేమో  
బయటి సముద్రాన్ని చూడడం కంటే
లోపలి సంద్రాన్ని చూడడమే కష్టం
కామెంట్‌లు