రూపకర్త:నాగమోహన్ ఎలిశాల గారు
గోపాల బాలుడే
బాల గోవిందుడే
గోవిందుడు అందరివాడేను చంద్రకళ...!
మురళీ మనోహరం
మనోహర మాధవం
మాధవ వేణుగానం మధురం చంద్రకళ...!
మోహనగానం అది
అది విన మురిసె మది
మదిని మురిపించె శౌరి గానము చంద్రకళ...!
వేణువునూదె వెన్నుడు
వెన్న దోచె కన్నడు
కన్నవారిదే భాగ్యం కదా చంద్రకళ...!
గాలిలో రాగాలు
రాగ లయ తాళాలు
తాళ సమన్విత బృందగానం చంద్రకళ...!
మధురమైన గానం
గాన బృందావనం
బృందావనం పావనమాయెను చంద్రకళ...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి