ఏది ముఖ్యం? అచ్యుతుని రాజ్యశ్రీ


 ఆన్లైన్ క్లాసులు జోరుగా సాగుతున్నాయి. చదివేపిల్లలు శ్రద్ధగా విని హోం వర్క్ పూర్తి చేసి ఒలింపిక్సు క్రీడలు చూస్తూ  ఆనందం బాధ వ్యక్తం చేస్తున్నారు. "అమ్మా!ఇంతవరకు మనకు  ఒక్క బంగారు పతకం రాలేదు."బాధ గా అంది జయ."చూడు తల్లి!ప్రైజ్  పతకం రాలేదు అని బాధపడుతూ కూచుంటే లాభం లేదు. అందరం అందలం ఎక్కితే మోసేవాడు ఎవరు?ఒలింపిక్సు లో పాల్గొనే అర్హత పొందటం తొలి మెట్టు.గెలుపుఓటమి దైవాధీనాలు. నిజంఆలోచిద్దాం.ఆన్లైన్ పాఠాలను ఎంత మంది ఆసక్తిగా విని వెంటనే టీచర్ చెప్పినది చేస్తారు? సాయంత్రం  రాత్రి  హోం వర్క్ చేస్తా అని ఠలాయిస్తారు.బోర్ కొడుతోంది అని ఫోన్ లో గేమ్స్ ఆడుతారు.మరి క్రీడాకారులు శారీరకంగా మానసికంగా ఒత్తిడి  దెబ్బలు  గాయాలు సహిస్తో రోజూ ప్రాక్టీసు చేసి తీరాలి. డ్రిల్ గేమ్స్  క్లాస్ కి నీవు ఎన్ని సార్లు డుమ్మా కొట్టలేదు? ఎన్.సి.సి.స్కౌట్ లో చేరే పిల్లలు ఏరి? ఇంటిలో యోగా మెడిటేషన్ చేయమంటే బద్దకం! కనీసం  వాకింగ్  గుడి చుట్టూ ప్రదక్షిణాలు  రావి వేప మారేడు చెట్ల చుట్టూ తిరగటంలో అంతరార్ధం  వాటి తాజాగాలి పీల్చడం వల్ల  మానసిక శారీరక  బలం జవం వస్తాయి. దేవుడి పేరు చెప్పితే కానీ వినని కాలం ఇది.తెల్లారుఝామున నమాజు రోజుకి మూడు సార్లు  చేస్తారు. కంఠస్వరం ఉచ్చారణ తో నాడులు చైతన్యం చెందుతాయి.వారు  శరీర భంగిమలు మారుస్తూ  కనీసం  ఒక గంట చేస్తారు. చర్చిలో ప్రార్ధనలు కూడా విశ్వాసం తో చేస్తారు. ఏమతం చెప్పినా మంచి మానవత్వం ని చెప్పుతుంది.సామూహిక ప్రార్ధన  భజన వల్ల   వైబ్రేషన్స్ మంచి ఆలోచన కలిగి పర్యావరణ పరిరక్షణ కి దోహదం చేస్తుంది. రోదసీ అంతరిక్షం లో ఓంకారం వినపడుతోంది అని నాసా వారు ప్రయోగం ద్వారా  తెలియజేశారు. మనం ఈచెవితో విని ఆచెవితో వదిలేస్తే ఇలాగే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ రేడియేషన్ మంచిది కాదు  అంటే  చాదస్తం అని  పసిపాప చేతికి ఇస్తున్నారు. నీవే ఆలోచించు ఏది ముఖ్యమో?"అమ్మ ఇంకా చెప్పుతూ పోతోంది. "స్వర్ణ పతకం గెల్చిన వ్యక్తి దాన్ని కాపాడుకోవడం  మళ్లీ పొందితీరాలి అనే తాపత్రయం లో మునిగి పోతాడు. వెండి పతకం వస్తే  బంగారం చేజారిపోయింది అని చింతిస్తాడు.కాంస్యం వచ్చినవాడు ఇంత వత్తిడిలో కూడా సాధించాను.దీనికి పోటీ లేదు అని పాజిటివ్ గా ఆలోచిస్తాడు.అందుకే  నిరాశలో కుంగకు.బ్రిలియంట్ విద్యార్ధి అనేక కారణాల వల్ల  రాంక్ రాదు.యావరేజ్  వాడు టాప్ లోకి దూసుకుపోవచ్చు.కాబట్టి  జ్ఞానం  సబ్జెక్ట్ పై పట్టు ముఖ్యం. ఇదే ముఖ్యం!"అమ్మ మాటలు విని  ఆలోచనలో పడింది జయ.


కామెంట్‌లు