ప్రకృతి(గేయం)జెగ్గారి నిర్మల--సిద్దిపేట
కాపాడాలి కాపాడాలి
ప్రకృతి మాత ని కాపాడాలి
వనము నదులు కాపాడాలి
వసుధయు స్వచ్ఛగ విలసిల్లాలి

గుట్టలో చెట్లను కాపాడాల
దారిలో చెట్లను రక్షించాలి
విరివిగా మొక్కలు నాటలి
కంచన చుట్టూ కట్టేయాలి

నిత్యము నీరు పారించాలి
చీడ పురుగులు తొలగించాలి
చక్కగా ఎరువును చల్లాలి
మిక్కిలి శ్రద్ధ చూపించాలి

కట్టు కాల్వలు కట్టేయాలి
పారే నీళ్లు ఆపేయాలి
పంటలు మిన్న గా పండించాలి
ప్రజలకు ఆహారమందించాలి


కామెంట్‌లు