రక్షాబంధన్:- - శ్రీ

 అనగనగా ఒక ఊరిలో వ్యవసాయం చేసే ఒక కుటుంబం . స్వాతి సందీప్ అనే భార్య భర్తలు ఉండేవారు. సందీప్ అనాధ ఆయనకు ఎవరూ లేరు భార్య కుటుంబాన్ని తన కుటుంబంగా భావించేవాడు. స్వాతి పని నిమిత్తం క్యాలెండర్ ని చూసింది. రెండు రోజుల్లో శ్రావణ పూర్ణిమ చూసి సంతోషపడింది. రాఖీ పౌర్ణమి వస్తుంది అన్నాతమ్ముళ్ళు వచ్చి వారిని తీసుకెళ్తారని సంతోషపడింది.
           స్వాతి తన పుట్టింటికి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఒకరోజు గడిచిపోయిన అన్న తమ్ముడు ఎవరూ రాలేదు. రెండో రోజు కూడా ఎదురుచూపులు మొదలు పెట్టింది మనసులో ఎంతో  బాధగా ఉంది.
           స్వాతి తల్లి తన పెద్ద కొడుకు తో చెల్లిని తీసుకురండి అని చెప్పింది కానీ నేను నా భార్య ను బయటకు తీసుకెళ్లాలి నాకు వీలు కాదు అని చెప్పాడు. తన చిన్న కొడుకు కి వెళ్లి అక్క ని తీసుకొని రా అని చెప్పింది. నా స్నేహితుడి పుట్టిన రోజు ఉంది నేను అక్కడికి వెళ్లాలి నాకు వీలు కాదు అని చెప్పాడు తల్లి బాధగా ఉండిపోయింది
           స్వాతి గుమ్మం ముందు కూర్చొని తన అన్నదమ్ముల కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. ఆ రోజు రాఖీ పౌర్ణమి ఇంకా అన్న తమ్ముడు ఎవరు రాలేదు ఏంటి అని బాధపడింది. సందీప్ వచ్చి ఎందుకు బాధ పెడుతున్నావ్ నాకు అంటూ ఎవరూ లేరు కనుక నేను బాధపడ నీకు అందరూ ఉన్నారు కదా నువ్వు బాధపడకు అని చెప్పారు స్వాతి మీరు బాధపడకండి అన్నభార్య వదిన మీకు రాఖీ కడుతున్న మీరు కూడా రండి అక్కడికి అని చెప్పింది. సందీప్ అన్నాడు మీ అన్న తమ్ముళ్లు ఏదో పనిలో పడి ఉంటారు అందుకే రాలేకపోతున్నారు. నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పాడు ఎంతో సంతోషపడింది.
           స్వాతి పెద్దమ్మ కొడుకు రమేష్ స్వాతి పుట్టింటికి వచ్చాడు.అక్కడ స్వాతి లేకపోవడంతో అయ్యో చిన్నమ్మ చెల్లి రాలేదా ఇంకా అక్కడ ఉన్న తమ్ముళ్లను మీరు చెల్లి ని తీసుకురా లేదా చెల్లి విలువ మీకే తెలుస్తుంది ఊరంతా అన్నాచెల్లెళ్ల తో రాఖీ పండుగ చేసుకుంటున్నారు నేను చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి వచ్చాను మీరు తీసుకుని రాకపోతే నేను వెళ్లి తీసుకొని వస్తాను కానీ వారిని కోప్పడ్డాడు. అప్పుడు వారిద్దరూ సిగ్గుతో తలవంచుకున్నాడు
           అంతలోనే స్వాతి సందీప్ అక్కడికి వచ్చారు. స్వాతి తన అన్నదమ్ములను చూసి ఎంతో బాధపడింది అన్నయ్య తమ్ముడు మీరు బాగున్నారా మీరు రాకపోయేసరికి మీకు ఏం జరిగిందని చాలా బాధ వేసింది. ఇప్పుడు సందీప్ స్వాతి వారి కోసం ఎంతో బాధ పడిన విషయం చెప్తాడు. స్వాతి అన్నదమ్ములు తన దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించు నిన్ను బాధ పెట్టే పొరపాటు ఎప్పుడు  చెయ్యను అని వేడుకున్నారు.
           అందరూ ఎంతో సంబరంగా రాఖీ పండుగ జరుపుకున్నారు ఒకరికి ఒకరు రాఖీ కట్టుకొని తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
                                                                                     
కామెంట్‌లు