01.
తే.గీ .
మానవత్వముపంచినమాన్యుడతడు
పేదవారికికాళోజిపెద్దవేల్పు
దోపిడీలకుపాల్పడెదొంగదొరల దుమ్ముదులుపుటహితమనెసమ్మతముగ!!!
02.
తే.గీ.
వ్రాసినాడుపొత్తములనువైభవముగ
మనతెలంగాణసమరముఘనతచాటి
ఉద్యమాలకునండగానుండియెపుడు
జనులముందుండినడిపించెసద్వివేకి!!!
03.
తే.గీ.
"ధీరుడాతండుతెలగాణపోరుసలిపి"
"మనతెలంగాణయాసలోమాటలాడి"
"అచ్చతెలగాణపదములన్నెచ్చటైన"
"పలుకవలెనంటుచెప్పినప్రథితయశుడు!!!
04.
తే.గీ.
తనువుమొత్తముకవితతోతల్లడిల్లి
మదినికల్మషంలేనట్టిమమతపంచి
తెలుగుభాషనురక్షింపదీక్షబూని
ముందుకేగినసత్కవిపూజితుండు!!!
05.
కం.
త్యాగధనుడుకాళోజీ!
"నాగొడవ"నురచనజేసినాణ్యతమీరన్
ఆగకనుద్యమమునుతా
సాగించినధీవిశాలిచతురుడునెపుడున్!!!
06.
కం.
వెలిగినసాహితికిరణము
తెలగాణాయాసబాసతీయదనంబున్
పలువురికినితెలియపరిచె
నిలలోకాళోజీగారునీప్సితమొప్పన్!!!
07.
కం.
కాళోజీ!కాళోజీ!
కాళోజీస్ఫూర్తికీర్తికవిలోకముకున్
కాళోజీతెలగాణకు
కాళోజీయండదండకదరాసుజనా!!!
08.
తే.గీ.
మాండలికయాసలనుగల్గిమహిమతోడ
మనతెలంగాణభాషయేమహినివెలిగె
దివ్యమైభవ్యమైరూపుదిద్దుకున్న
భాషలన్నింటమనభాషవాసికెక్కె!!!
09.
తే.గీ.
జానపదజావళీలతోజతనుగట్టి
దరువుమ్రోగించివిభవమ్ముస్థిరముగాను
నిలుపుకున్నట్టిమనభాషపిలుపులోన
సతమునాప్యాయతలునుండుసంబరముగ!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి