301.
పరదూషణ పాపము
రెచ్చగొట్టుట ఘోరము
మనసు విరుచుట సులభము
గాయం మాన్పుట కష్టము
302.
మలినమాయెను మనసులు
కలుషితమాయె వాయువులు
భారమాయెను రోజులు
అవగాహన అవశ్యములు
303.
ద్వెశమె కడు విషము
ప్రేమనే అమృతమయము
నిలువునా చేయు దహనము
తెలుసుకుంటే మోదము
304.
అమ్మ అను అర్థనాదము
మూగప్రాణుల శోకము
కదిలించే నా హృదయము
వాటి ప్రాణము తీయకుము
305.
జిహ్వ చాపల్యము కొరకు
ప్రాణము తీయుట ఎందుకు
బతకనివ్వు కడవరకు
తోబుట్టువులని మరువకు
306.
కనికరము లేని వాడవు
నీతులు చెప్పగలవు
ప్రాణం పోయలేవు
పెట్టు పాపాలకు సెలవు
307.
చరాచర సృష్టి యందు
పరమాత్మ దృష్టి కలదు
జీవితం శాశ్వతమవదు
నీ వెంట ఏమి రాదు
308.
వాయిదాల పర్వము
మనుషుల మనస్తత్వము
విడిచిపెట్టు నిర్లక్ష్యము
చేపట్టు సంకల్పము
309.
అతిగా మాట్లాడకు
ఆవేశం చూపకు
మనసులను గాయపరచకు
రాక్షసుడిలా మారకు
310.
కొందరు అతి లౌకికము
చిన్నచిన్న తాయిలము
మాయలో పడవేయు మిము
కనుము నీవా నిజము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి