సమస్యా పూరణం:-మమత ఐలహైదరాబాద్9247593432

 *మంచిదలంచబోకు మరి మా నవజాతికి ముప్పుగల్గులే*

ఉ.
కుంచిత బుద్ధిలేక మరి కోవెలయందలి పూలరీతిగా
నెంచిన కార్యమెల్ల యును నిక్కము దప్పక చేయువారినే
వంచన చేయబూను జన వంద్యుల గాంచుట కర్మమేమొ యే
*మంచిదలంచబోకు మరి; మా నవజాతికిముప్పు గల్గునే*

కామెంట్‌లు