మా బుజ్జి కన్నయ్య:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
బుజ్జి బుజ్జి కన్నయ్య
బుల్లి బుల్లి చిన్నయ్య
మారాము చేయకయ్య
మా రాజువు నీవయ్యా !

అమ్మతోడు నీకు లేకున్నా
అన్ని నేనై నేను నీకు ఉన్న
ఏడువకు రా నా కన్నా
ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకోరన్న!

మీ అమ్మ జాడ లేకున్నా
మీ నాన్న కూడా రాకున్నా
నేను నీకు తోడుగా ఉన్నా
దిగులెందుకు రా ఓచిన్నా !

అమ్మ నీకు లేదురా
ఉన్న గాని రాదురా
ఏడవకు నీవు కన్నా
విడవకు నావేలన్నా. !

అమ్మలా నిన్ను నేను ఆడిస్తా
నాన్నలా నడకనే నేను నేర్పిస్తా
నీకు లాలపోసి ముస్తాబు చేస్తా
నిత్యం నిన్ను బడికి నే తోలిస్తా !

నే తాతలా  నిన్ను ఆడిస్తా
తాయిలాన్ని  ఇక తినిపిస్తా
వెతలన్నీంటిని మరి పిస్తా
కథలెన్నో నీకు వినిపిస్తా !


కామెంట్‌లు