వృద్ధాప్యం అనుభవాల సారం
భగవంతుడు ఇచ్చిన ఓ వరం
కాదులే మనిషికి అది ఇక భారం !
అర్థం చేసుకొని ఆచరిస్తే
లభించు పరమార్థం మస్తే
పసితనం తిరిగి వచ్చు
పాలమీగడలను ఇచ్చు!
కాస్త కంటిచూపు తగ్గవచ్చు
నడుం వొంగి కృంగి పోవచ్చు
అవయవాలు శయనించు
మనసు పాదరస మై ప్రవహించు!
గుడ్డు ముసలిదైతే గొంతు కోసేరు
మనిషి ముసలియైతే మూలనేసేరు
జరుగుతున్న అసలు విషయం ఇది
కరుగుతున్న సిసలు విషంమైనది !
తప్పదులే వృత్తి జీవితం దశ
ముక్తికై నీవు పెంచుకో నీవాశ
మనిషి జన్మ కాదులే ఆషామాషీ
అర్థం చేసుకొని నీవు కావాలి రుషి !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి