జయ విజయీభవ మా పరమాత్మ
మా భారత ప్రజలందరి నేతవు
మా హారతి గైకొను శాంతిదూతవు!
పోరుబందరు గ్రామంలో పుట్టి
పోరు సల్పుతు నడుం నీవు కట్టి
అహింస ఆయుధాన్ని చేతబట్టి
సాగించావు సమరం ప్రతినబట్టి !
ఆంగ్లేయుల మెడలను వంచావు
దాస్య శృంఖలాలకు తెర దించావు
కుతంత్రాన్ని అహింసతో బంధించావు
స్వాతంత్రాన్ని సరుగును మాక్ అందించావు!
బొల్లిగద్ద వచ్చి రివ్వున కోడిపిల్లను
తన్ను కెళ్లి దవ్వున తీసుకెళ్లి నట్లుగా
ఆంగ్లేయులు వచ్చిరిగా దొంగచాటుగా
దేశ సంపదను కొల్లగొట్టిరి ఉన్నపాటుగా !
భరత జనుల యోగక్షేమాలను ఆశించి
భారతదేశం వదిలి పోవాలని ఆంగ్లేయుల శాసించి
అహింసా సమర శంఖాన్ని పూరిం చావు
ఏ హింస లేకుండా స్వాతంత్రాన్ని సాధించావు !
నీవు మన దేశ స్థితి గతులను ఆలోచించి
రాత్రింబవళ్ళు బాగా నువు అవలోకించి
సత్యాగ్రహ జ్యోతిని వెలిగించావు
మా నిత్య గ్రహ బాధల తొలగించావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి