గుర్రాల ముత్యాల హారాలు.:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977. నాగర్ కర్నూల్ జి

 882) అవిగో చిరుధాన్యాలు
         ఇవి మా ఉద్యానవనాలు
          వీస్తున్నవి పవనాలు
          అవన్నీగూడ మన చేలు !
883) వచ్చాడా బాపనయ్య
        పూజ చేస్తా డయ్య
       త్వరగా పిలువయ్య
        విన్నావా రామయ్య!
884) అదిగో మా పూజ గది
          వారికి చూపిస్తున్నది
          చూస్తున్నావా అన్నది
         ఎంతో మెచ్చుకున్నది!
885) ఎక్కడ ఉంది భూమి?
         చూపించు మాకు  స్వామి
         మీకోసం వచ్చే దామి
        నీవు నిజం చెప్పవేమి!
886)మహిలోన మన వనిత
        ఆమేగా మన భవిత
        అనిచప్పెను కవిత
        విని వచ్చెను అనిత!
887) చిన్నారి మా సుకుమారి
         మావరాల రాకుమారి
         నేర్చింది రథ సవారి
        అందు తాను నేర్పరి  !
888) కట్టురా పసుపు కొమ్ము
         ఆ కలశం ఇటు ఇమ్ము
         చేయి నీవు సాహసమ్ము
         బదలాం చేయకు మమ్ము !
889) పసి పిల్లల మాటలు
        తేనెలూరు ఊటలు
        వారు ఆడే ఆటలు
         దూసుకొచ్చే ఈటెలు !
890) వారి తీపి తీపి కలలు
         కన్నవారి మది అలలు
        ఏమి ఎరగని బేలలు
        సుతిమెత్తని పూమాలలు !
891) జన గణమన అని పాడు
         స్వాతంత్ర దినం నాడు
         ఆటపాటలను  పాడు
          గత స్మృతులను తోడు !
892) నీరు మన జీవనాడి
          బావుల ద్వారా తోడి
          వాడుతున్నంగా డాడి
           వృధా చేయకు వాడి !
893) గేదెలకు దాన పెట్టు
         తీసుకరా గోనె తట్టు
          పొడిపొడిగా విడగొట్టు
          అవివాని మూతి పెట్టు !
894) తగిలింది ఎదురుదెబ్బ
         అదిరిందా నీ జబ్బ
          గుయ్యిమందా గుబ్బ
           కొట్టుకోకు నీ డబ్బ !
895) అయ్యిందిగా ఇక మాఫీ
         అందిందా రుణమాఫీ
         చెప్పవేమి ఓ సోఫీ
          త్రాగు నీవు ఈ కాఫీ!
896) తీశారు లే పిడకలు
         వేశారులే పడకలు
        వారు కట్టారట తడకలు
        వీరు పెట్టారట కుడకలు !
897) పెరిగిందా ఆదాయం
         కలిగింది ఈ ఉదయం
         మరి చేయవా సాయం
          ఆ మాటంటే  భయం !
898) అదిగో ఆసుపత్రి
         పో లోపలికి సావిత్రి
          లోపల ఉంది ధాత్రి
           ఆమెకియ్యి ఈ చెత్రి !
899) ఎవరిదీ వారసత్వం
         ఏమిటిరా నీ తత్వం
           చెప్పకు నీ కవిత్వం
           చూపించు ధీరత్వం !
900) అయ్యాయి తొమ్మిది వందలు
         కావు ఇవి గురివిందలు
         కావులే అలసందలు
         మంచి ముత్యాల హారాలు !

కామెంట్‌లు