"ప" గుణింత గేయం:-వై.అంజలి--9వ తరగతి .ఈ/యంజి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

 పవిత్ర,  సుమిత్ర  రారండి
పాఠం బాగా చదవండి
పిల్లల్లారా మనమంతా
పీచు మిఠాయి తిందాము
పుస్తక పఠనం చేద్దాము
పూర్తిగాచదివి నేర్చేద్దాము
పృథ్వి ఎంతో గొప్పది రా
"పౄ" చక్కగ  పలుకుదాము
పెద్దా, చిన్నా  అందరము
పేదల పెన్నిధి అవుదాము
పై చదువులు  చదువుదాము
పొగడ్తలు ఎన్నో పొందుదాము
పోకిరి పనులను మానేద్దాము
పౌరుషంతో బ్రతుకుదాము
పండుగలు ఎన్నో చేద్దాము.
కామెంట్‌లు