టీచర్ గా..!:-యలమర్తి అనూరాధ

 అసలు ఉద్యోగం వద్దు అనుకున్న నేను మా వారు బ్యాంకు కి వెళ్ళాక ఏం చెయ్యాలో తోచక నవలలు చదవటమే పనిగా పెట్టుకున్న నేను అలా కాదని పక్కనే ఉన్న తేలప్రోలు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యాను.ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్,థర్డ్ క్లాస్ కి క్లాస్ టీచర్ గా చేశాను.అంతకంటే పెద్ద క్లాసులకి వెళ్ళటానికి నేను ఇష్టపడలేదు.ఎందుకంటే ఆ విద్యార్థులు టీచర్ ల చీరలు, అలంకరణ గురించి కామెంట్ చేసే ఎత్తుకు ఎదిగారు వాళ్ళు. అసలు ఈ రోజు నేను చెబుదామనుకున్నది ఏమిటంటే.. మా బాబు  కడుపున పడ్డాడని తెలియగానే నేను ఆ ఉద్యోగం నుంచి వైదొలగాలి అనుకున్నాను.నా క్లాస్ లో పిల్లలు అందుకు ఒప్పుకోలేదు.విమానంలో మీకు అందకుండా వెళ్ళిపోతాను అంటే తోక పుచ్చుకుని మేము వచ్చేస్తాము తప్ప మిమ్మల్ని విడిచి ఉండమనే అమాయకత్వం వారిది. అదే నేను వాళ్ళందరిలో చాలా ఇష్టపడినది.
   ఆ సమయంలోనే బెస్ట్ టీచర్ అవార్డ్ కూడా అందుకున్నాను. ఎక్కడికి పిల్లలను తీసుకువెళ్లాలన్నా ముందు నా పేరే ఉండేది. అవుట్డోర్ సెక్షన్
స్కూల్లో అంతా నాదే!
    నా దగ్గర అలా చదివిన విద్యార్థిని ప్రేమ వ్యవహారంలో కూడా గెలిపించాలని ప్రయత్నం చేశాను.
     ఆనాడు పిల్లలతో తీసుకున్న ఫొటోలు ఇప్పటికి నా దగ్గర భద్రంగా ఉన్నాయి వాళ్ళందర్నీ గుర్తుచేస్తూ. ఇప్పుడు వాళ్లంతా ఏ డాక్టర్లో, ఇంజెనీర్లో,టీచర్లో అయిపోయి ఉంటారు.
    అలా ఆ స్కూల్లో ఆరేండ్లు పనిచేశాను.
    ఇలా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీతో నా భావాలు పంచుకోవటం చాలా ఆనందాన్నిస్తోంది.


కామెంట్‌లు