జ్ఞాన జ్యోతి:-యెల్లు అనురాధ రాజేశ్వర్రెడ్డి--సిద్దిపేట
గురువు గురువు గురువు
 జ్ఞానజ్యోతి గురువు

అమాసచీకటి బతుకుల్లో
వెలుగును నింపే సూర్యుడు 
తాను కాలుతూ కాంతినిపంచే
 విజ్ఞానపు ఘని ఉపాధ్యాయుడు 

నిస్వార్థపు రెక్కలు కట్టుకొనీ 
తనకంటే ఎత్తుకు ఎదిగేలా
 ఉన్నత శిఖరాలు ఎక్కించే
 మహామహుడే ఆ గురువు

విజ్ఞానపు గని ఆ గురువు
విలువల చదువులు తానేర్పి
నవ సమాజ నిర్మాణముకై
తప్పించి పోయే చైతన్య ముర్తి


అమ్మ నాన్నలిచ్చిన తనువులో
 అక్షర బీజం నాటేసి
కలుపు మొక్కలా నేరేసి
కర్మ యోధుల్ని చేసేధి

విశ్వ చీకటిని తొలగించి
విజయ పథమున నడిపించేది
 గురువు గురువు గురువు
గురువు గురువు గురువు


కామెంట్‌లు