నీడలు తొక్కుడు ఆట (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

సాయంకాల సమయంలో
ముసి ముసి మబ్బు కప్పగా
మిల మిల చుక్కలు మెరువగా
సంధ్యా దీపం వెలిగింది !!

అమ్మ అన్నం పెట్టింది
పాలుపోసి కలిపింది
మిద్దె పై కి వెళ్ళాము
జాబిలమ్మను చూపింది !!

గోరుముద్దలు పెట్టింది
గబగబ నేను తిన్నాను
అక్కా అన్నా వచ్చారు
చందమామను చూశారు !!

నీడలు తొక్కే ఆటల్లో
పరుగులు తీస్తూ వెళ్లాను
సూరు కింద చేరాను
అమ్మ చూసి నవ్వింది !!


కామెంట్‌లు