"జ" గుణింత గేయం: --- మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 జలజా,వనజా వినరండి
జాతర మనము వెళ్దామా
జిలేబి కొని  తిందామా
జీడిమామిడి కొందామా
జుజుబీ పండ్లను కొందామా
జూటా  మాటలు వదలాలి
జృంభణము  చెందాలి
"జౄ"  అని ఉచ్చరించాలి
జలగ లాగ  ఉండొద్దు
జేజే బువ్వ తిందాము
జైత్రయాత్ర చేద్దాము
జొన్న కంకులు తిందాము
జోగులాంబను చూద్దాము
జౌళి పరిశ్రమ పరిశీలిద్దాము

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మీరేంటీ ఇలా వ్రాసారనిపిచ్చింది
మీరింకా మంచిగా వ్రాయగలరే
..........కార