మూగ ప్రాణులు - బాల గేయం -ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
మియ్యామ్ మియ్యామ్ పిల్లమ్మా 
మీసాలటు ఇటు తిప్పమ్మా 
ఎలుకల వేట నీకిష్టం 
ముడుచుకు పోయి నిద్రిష్టం!

భౌ భౌ కుక్కా అరవకురా 
అనవసరంగా కరవకు రా 
చెప్పినట్లుగా వింటావా 
చక్కని బిస్కెట్ తింటావా !? 

కాకులు గోల అనకండి 
గోడపై అన్నం వేయండి 
పక్షులు ప్రకృతి ప్రసాదము 
గింజలు వేయుట మరి పుణ్యం!

పిచ్చుక ఉడతల ఆచూకీ 
అసలే లేదే ఎక్కడనూ 
చెట్టూ చేమ లేకుండా 
మూగ ప్రాణులు అదృశ్యం!!


కామెంట్‌లు