*మీసాల ఎలుక*(బాలగేయం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మీసాల ఎలుకా వచ్చింది
గోడకు కలుగూ చేసింది
ఇల్లంత గునగునా తిరిగింది
ఆహారధాన్యాలు వెదికింది
దొరికినవి పరపరా నమిలింది
బట్టలూ బొమ్మలూ కొరికింది
నాన్నగారు పిల్లిని తెచ్చారు
ఇంటిలో విడిచి పెట్టారు
ఎలుక పిల్లిని చూసింది
భయముతొ ఇల్లు విడిచింది!!

కామెంట్‌లు