*బావిభారత పౌరులు ముత్యాలహారం*:-పసుమర్తి నాగేశ్వరరావు-టీచర్ సాలూరు విజయనగరం జిల్లా
బావిభారత పౌరులు
మన ముద్దుల పిల్లలు
భావితరం వారసులు
భవితకు రధసారధులు

నిత్యం నవ్వే నవ్వులు
మన పూదోట పువ్వులు
మన సిరి సిరి మువ్వలు
గల గల మనే గువ్వలు

తెలియదు అభం శుభం
లేదు లేదు కల్మషం
లేనే లేదు బూటకం
పిల్లలే నిత్య శుభం

విరిసి విరియని మొగ్గలు
తెలిసి తెలియని సిగ్గులు
ఆకుచాటు పిందెలు
ఎదుగుతున్న మొగ్గలు

ఆటపాటలతో చదువు
కాదేది వారికి బరువు
చదువు వారి బతుకు తెరువు
చదువే తెచ్చును కొలువు

వారి కలల ప్రపంచం
వారి ఊహ ప్రపంచం
ఆనందాల ప్రపంచం
పాఠశాలే ప్రపంచం

స్నేహితులతో సందడి
పిల్లలతో హడావుడి
ఒకరికొకరు ముడిపడి
చేయు సందడే సందడి

పిల్లలే మన దైవాలు
వారే మన జీవితాలు
వారే మన జీతాలు
వారే మన జీవనాలు

చూపాలి మంచి మార్గం
చేయు భవిత స్వర్గం
పిల్లలే భావి వర్గం
అదే భవిత మార్గం

పిల్లలుకు ఆశీస్సులు
నిండైన వారి మనస్సులు
వెలగాలి ఉషస్సులు
భవితకు తేజస్సులు


కామెంట్‌లు