జామ చెట్టు లాంటి మిత్రుడు మిన్న.
చంద్రబింబం లాంటి నుదుటిపై ముద్దు కన్నా
నెలవంక లాంటి ముక్కుపుడక మిన్న.
అద్దంలోపలి ముఖం కన్నా
అద్దం పై వాలిన పెదాల చిరునవ్వు మిన్న.
ఆకాశంలో ఎగిరే మేఘం కన్నా
భూమిపై పడి చిట్లిపోయిన చినుకు మిన్న.
సముద్రంపై చిన్న చిన్న అలలు నేను అనుకునే కన్నా
సముద్రం నేను అనుకోవడం మిన్న.
కంటిలో కనిపించే కాంతి కన్న
శ్వాసలో కనిపించని గాలి మిన్న.
మహా పర్వతంపై మనిషి కన్నా
పండ్ల చెట్టుపై కోతి మిన్న.
గీత లాంటి విత్తనం కన్నా
పచ్చని ఆకులాంటి గీతం మిన్న.
అబద్ధం లాంటి అభద్రత కన్నా
యుద్ధంలాంటి బ్రతుకు మిన్న.
నిగూఢమైన మనసు కన్నా
గాడమైన నిద్ర మిన్న.
=============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి