*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

      36.ప్రేమ!
     స్త్రీ, పురుషుల మధ్యేనా?
     విశ్వాన మానవ సయోధ్య!
     అది ఉన్నచోటే అయోధ్య!
     లేకుంటే జగమంతా మిథ్య!
37.ప్రేమ!
      సులోచన!
      సద్భావన!
      సున్నితం!
      సత్యం,శివం, సుందరం!
38.ప్రేమ!
      హార్దిక వందనం!
      హృదయ బంధనం!
      హరి చందనం!
      భువి నందనం!
39.‌ ప్రేమ!
       పెళ్ళికి ముందు జల్సా!
      తరువాత సరిగమపదనిస!
      సంసారానికి భరోసా!
      జీవితాంతం కులాసా!
40. ప్రేమ!
       మనకి ఆక్సిజన్!
       భూమికి ఓజోన్!
       శాంతికి ఫ్రీ జోన్!
       అది నీ ఓన్, ఓపెన్!
        (కొనసాగింపు)

కామెంట్‌లు
రామానుజం. ప చెప్పారు…
ప్రేమ తత్వాలు విశదం సూక్ష్మంగా 🌺 సరళంగా 🌹