కన్నీళ్ళు:- సత్యవాణి

 హృదయానికి నొప్పి కలిగితే
అదేమిటో చిత్రం
కళ్ళు చెమరుస్తాయి
ఆపై నీళ్ళు కారుస్తాయి
గుండె కుండను మోస్తున్నట్లు బరువెక్కినా తమాషాగా
కనులు వర్షిస్తే
తేలికపడుతుంది గుండె
తల నొచ్చినా
పన్ను నొచ్చినా
చెవి నొచ్చినా
సహానుభూతి చూపేవి కనులే  
లోకంలో ఎక్కడ
ఏ అఘాయిత్యం గమనించినా
కనులు కరిగి  
కన్నీటి వరదలౌతాయి
తమను ఇసుమంతైనా
పట్టించుకోనివారికోసం
వాటికోసం
తామెందుకు వగవాలని 
అనుకోని కనులు
నిస్వార్థానికి ప్రతీకలు 
అటువంటి కనులలో
నలకపడి 
బాధతో కలతపడుతున్నా
కన్నీళ్ళు ధారాపతాలౌతున్నా
పట్టిచుకొనే
నాధుడేడీ
చుక్క కన్నీరు విడిచేవారెవరు
సాటి కనులు కూడా 
రెండు చుక్కలు
కన్నీళ్ళు విడువవు
వెలలేని కన్నీళ్ళు
వెక్కిరింతలపాలు
నెత్తిన నీళ్ళకుండ అంటూ
విలవైన తలనుకూడా
హీనపరుస్తారు
కన్నీళ్ళ ఆక్రోశానికి
కడలేదు
          
కామెంట్‌లు