చైతన్య స్రవంతిలో ...!!:- -- డా. కె.ఎల్వీ.ప్రసాద్ --హన్మకొండ.

 పౌరుషం లేని 
పిరికిపందలు వారు 
బానిసబ్రతుకు లకు 
బందీలువారు ....!
ఎండ ఎరగని 
తిండిపోతులు వారు ,
తాత్కాలిక తాయిలాలతో 
తందనాలు అడుదురు 
స్వంత భవనాలకే....
చిల్లులు పొడిచెదరు !
నాయకత్వము పేర 
నటనలుపోవుదురు 
స్వంతమనుష్యులమధ్య 
చిచ్చుకు వెనుకాడరు !
స్వంతకులాలోనే 
వింతపోకడలు పోదురు ,
నోరువిప్పరాదు 
తెలివిగా ...
మాట్లాడరాదు ....
మహిళ గొప్పతనము 
అసలు ఓర్వలేరు !
చేతకానివాడు 
చప్పున పడివుండవలె ,
మహిళలైననేమి ....
వారి చైతన్యమును 
కొనియాడవలె ....
మూర్ఖ చేష్టలుమాని 
ఒక్కటిగా నిలవాలి 
ఉద్యమాలకు ప్రతివక్కరు 
వెన్నెముకగా నిలవాలి !!
           

కామెంట్‌లు