అలక వహించి దూరం జరిగితే
నవ్వులు రువ్వక మూతి బిగిస్తే
చిన్నబోయిన నే మోము చూసి
ముద్దు ముద్దు మాటలు మాట్లాడక
లడ్డూలు కావాలని మారాము చేయక
కొత్త గౌను కొనివ్వమని రాగాలు తీయక
మా మది బోసిపోయి చిన్నబోయింది.
బుడి బుడి అడుగులు ఇంట్లో వినపడక
గజ్జెల ఘల్లు ఘల్లు మని తారాడక
కిల కిల నవ్వులు గల గల లాడక
మా గుండె కొట్టుకోవడం లయ తప్పింది.
బుజ్జి కన్నా! అలక మాని మాట్లాడును
నీవే మా బం గారు తల్లి, మా చిట్టి తల్లీ
మారాము సేయకు నా ముద్దుల తల్లి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి