మన గురువు జాడ ఇది!:--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 తేట గీతి 
మహిళ కభ్యుదయములెల్ల మనవియనుచు 
జాడ చూపించి వెలిగించె జాతినిచట 
గురువు లందును తానొక గొప్ప గురువు 
పుత్త డయ్యెను ప్రతిమాట పూర్ణముగను!
వెంట బడియెడు రాజుల వెక్కిరించి 
కన్య కగ్నిని దుముకుట కవితలల్లె 
మూఢ నమ్మకమ్ము వదిలి ముందు తరము 
ప్రగతి బాటలు సాగంగ ప్రతినిధయ్యె!

కామెంట్‌లు