బహుముఖ ప్రజ్ఞాశాలి డా. భానుమతి రామకృష్ణ :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 తేట గీతి 
చలన చిత్రసీమకుతన చక్కదనము 
హాయి గొల్పెడు గాత్రమ్ము హారమయ్యి 
భాను మతిగను పుణ్యమ్ము భరతభూమి 
నిలిచి వెలిగెను బహుముఖ నియతి గల్గి 
ధీర గంభీర నటనమ్ము ధీరురాలు 
వాసిగలిగిన  ప్రజ్ఞయు వనితలోన
నటులు భయమొందు శిక్షణ నారిగలిగి 
మోహనమ్మగు చిరునవ్వు మోవియందు!
ఆ /వె /
విద్య లందు వెలిగి విజయమ్ము పూర్ణమై 
లలిత మగుచు పాట లాలి వలెను 
చండి రాణి తాను చందమామను బోలి 
మల్లి గాను పల్లె మమత జూపె!

కామెంట్‌లు