మనపై మనకు నమ్మకం ఉండాలి. మనకలలు నిజంకావాలంటే సాధన నిరంతర కృషి పట్టుదల ఉండాలి.అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కనాలి.గాలిలో దీపం పెట్టి దేవుడా నీమహిమ అంటే కుదరదు. మరి ఈకధ చదివితే అర్థమవుతుంది. చంపానగరంలో జినదత్తుడు సాగరదత్తుడనే ఇద్దరు బాలలు స్నేహితులు. వారు ఒక రోజు నగర ఉద్యానవనంలో ఆడుకుంటున్నారు. ఒక నెమలి రెండు గుడ్లు పెట్టడం చూశారు.
పిల్లలకు కుతూహలం సహజం. తల్లి నెమలిని తరిమేసి ఇద్దరూ చెరిఒక గుడ్డు తీసుకున్నారు.సాగరదత్తుడు త్వరగా ఏదీ నమ్మడు.ఆ గుడ్డు లోంచి నిజంగా నెమలి పిల్ల వస్తుందా రాదా అని దాన్ని పదేపదే చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పేవాడు.కదిలించేవాడు.తన చెవి దగ్గర పెట్టుకొని లోపల పిల్ల ఏంచేస్తోంది శబ్దం వినటం కోసం తెగతాపత్రయపడేవాడు.ఇలా రోజు చేయటంవల్ల గుడ్డు లోని పిండంకాస్తా చెడిపోయి నిర్జీవంగా మారింది. అది కుళ్లి వాసనకొట్టడంతో బైట పారేశాడు. జినదత్తుడు పూర్తి నమ్మకంతో ఆగుడ్డుని గూడులాగా చేసి అందులో భద్రంగా ఉంచాడు.కంటికి రెప్పలాగా కాపాడాడు.తగిన ఉష్ణోగ్రతలో ఆగుడ్డు చక్కగా ఎదిగి అందులోంచి బుల్లి నెమలి పిల్ల వచ్చింది. దాని సంరక్షణలోనే గడిపాడు. అలా పెద్దది ఐన ఆనెమలిని స్వేచ్ఛ గా తోటలో వదిలాడు.అది అక్కడకి వచ్చే పక్షులతో కలిసి ఆడేది. ఈకథని ఒక గురువు గారు తన శిష్యులకి చెప్పి దాని విశేషం మూలార్ధం ఇలా వివరించారు. "సన్యాసి కూడా అహింస సత్యం అచౌర్యం బ్రహ్మచర్యం అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలని అనుమానించరాదు.సాగరదత్తుని లా ప్రవర్తించే సన్యాసి సరిగ్గా నియమాలు పాటించకపోతే నష్టపోటమేగాక ఇతరుల దృష్టి లో చులకన అవుతాడు.ఆధర్మం పట్ల జనాలకి దురభిప్రాయం కలిగిస్తాడు.మంచి చేయకపోతే ఊరుకోవాలి.కానీ ఇతరులను తప్పు దోవ పట్టించరాదు.సమాజానికి దేశం కి కీడు చేయరాదు.మతంని అడ్డుగా పెట్టుకుని అపకారం దురభిప్రాయం కలిగించరాదు.గురువు గారి మాటలు విన్న శిష్యులు అలా మంచి మార్గం లో పయనించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి