మట్టి గణపతి -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
మట్టి గణపతిని చేశాము 
గట్టిగ దండం పెట్టాము 
చెట్టూ పుట్టా వెతికాము 
పత్రిని స్వామికి తెచ్చాము!

గరిక తోడుగా మొదలెట్టి 
గన్నేరు జిల్లేడు కాయలెట్టి 
మాచి పత్రిని మా గణేశునికి 
వెలగ,నేరేడు,అరటి పెట్టి!

పాలవెల్లిని క

ట్టాము 
పాయసం కుడుములిచ్చాము 
ఓ బొజ్జ గణపయ్య పాడేము 
మీ బంటుగా హారతిచ్చాము!

గుంపులు గుంపులు ఉండొద్దు 
బైట మాస్క్ లు మరవొద్దు 
పర్యావరణ హాని కలిగేటి 
పనులను మనము చెయ్యొద్దు!

కామెంట్‌లు