*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

   41.ప్రేమ!
        చూపు చర్మం దాటాలి!
        మనసు  తడియాలి!
        హృదయం గెలవాలి!
        జీవితం మురియాలి!
42. ప్రేమ!
       గొప్ప గమ్మత్తు!
       అసలైన విద్వత్తు!
       ప్రవాహ విద్యుత్తు!
       నిలవదే విపత్తు!
43.ప్రేమ!
     వజ్రం!
     విజయం!
     అద్వితీయం!
     అమరం!
44.ప్రేమ!
      ప్రేమికులు పోతేనేం!
     ప్రేమ మిగిల్చి పోతారు!
     ప్రేమ గురుతు(వు) లే!
     లోకాన నిత్య స్తుతులే!
45.. ప్రేమ!
       యుగాలకు ఆది!
       కాలా(వ్యా)నికి పునాది!
       నిజాయితీకి నాంది!
       నిస్వార్థానికి బందీ!
          (కొనసాగింపు)
--------------------------------------

కామెంట్‌లు
రామానుజం. ప చెప్పారు…
ప్రేమ... ఆది , అనాది , పునాది 🍇👌
BSN Murty చెప్పారు…
బాగుంది sir. చాలా బాగా రాశారు