జడి వాన (బాల గేయo):-ఎం. హారిక7 వతరగతిజడ్పీ స్కూల్లక్ష్మిదేవి పల్లిజిల్లా,: సిద్దిపేట9441762105
వానలు బాగా కురిసెను
చెరువులన్నీ నిండెను
మత్తడి అలుగులు పారెను
 కాలువ నిండుగా పారెను

పిల్లలు పడవలు చేసెను
నీటిలోన వదిలెను
కాలువలెన్నో చేసెను
ఇంజనీర్లు ఆయెను

పంటలు నీట మునిగెను
రైతుకు కన్నీళ్లు మిగిలెను
పక్షుల గూడు చేదెరెను
ఆహారo లేకపాయేను

ఉరుములు ఉరిమెను
మెరుపులు మెరిసెను
పిడుగులు రాలేను
వడగండ్లు వచ్చెను

ఊరు వాడ మునిగెను
తిండికి తిప్పలు వచ్చెను
వీధులన్నీ మురికాయేను
అంతా కలుషితం మాయెను



కామెంట్‌లు