"విజయదశమి-దసరాపండుగ-దుర్గామాతస్తుతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467
 01.
కం.
కలలనుగనుమనియువతకు
పిలుపునునబ్దులుకలాముప్రియముగనిచ్చెన్
ఫలితాలనుపొందుటకును
నలుపెరుగనిశ్రమసతంబునవసరమనియెన్!!!
02. 
ఆ.వె.
ప్రజలరాష్ట్రపతిగపరిపాలనముజేసి
గొప్పసంస్కరణలుకువలయమున
తెచ్చిపేరుగాంచెధీశాలియబ్దుల్క
లాముగారుగాదెనేమముగను!!!
03.
ఉ.
భారతమాతముద్దుసుతుభాగ్యవిధేయు"కలాముమాన్యుడై
భారతజాతిరత్నముగవర్ధిలి,భాసిలిశాస్త్రవేత్తయై
పేరునుపొందినట్టిభువిపిల్లలవృద్ధికిమార్గదర్శిగా
దారినిజూపినాడుతను,దార్శనికుండయినెల్లవేళలన్!!!
04.
కం.
దండముదుర్గాదేవీ
దండమునీకెపుడుజేతుదయజూపవదే
గండములన్నియుబాపుచు
దండిగననుబ్రోవుమమ్మదాక్షాయణివై!!!
05.
కం.
దేవీదుర్గామాతా
నీవేమాకిలసతంబునిక్కముతోడన్
జీవనసౌభాగ్యమొసగ
రావేమముగన్నజననిరత్నశుభాంగీ!!!
06.
కం.
కారుణ్యశీలిదుర్గా
భారమునీవేయటంచుబ్రతుకీడ్చితినే
దూరముజేసియుపాపము
దారినిజూపించుమమ్మతగువిధములుగన్!!!కామెంట్‌లు